Delhi Liquor Scam Case: శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. తన భార్య అనారోగ్య కారణంగా బెయిల్ కావాలని ఆయన వేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ ఎవెన్యూ కోర్టు.. 4 వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయన త్వరలోనే విడుదల కానున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయనకు చెందిన మూడు కంపెనీల ద్వారా 64 కోట్లకు పైగా ఇప్పటికే అక్రమంగా సంపాదించినట్లు ఈడీ గుర్తించింది.