మేం ఎం పాపం చేశాం సర్.. నియామకమైన పోస్టులోనే రిటైర్డ్
మేం ఎం పాపం చేశాం సర్!
నియామకమైన పోస్టులోనే రిటైర్డ్..! టీచర్ల ఆవేదన…
బంజారా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దశరత్ నాయక్ మిర్యాలగూడ(తెలంగాణ పవర్ )మేం ఎం పాపం చేశాం.. నియామకం అయినా పోస్టులోనే రిటైర్ అవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ్ నాయక్ అన్నారు. సోమవారం మిర్యాలగూడలో విలేకర్లతో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడంతో నియమించబడిన పోస్టుల్లో అనేక మంది రిటైర్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటువంటి అర్హత పరీక్షలు లేకుండా నియామకం అయినా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సంతకం చేసిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ చేయడానికి మేం వ్యతిరేకం కాదని అడ్ హాక్ పద్దతిలో పదోన్నతులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.1989,1995 డిస్సీ ద్వారా నియామకం అయినా వారికి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదని అన్నారు.దాదావు 30 సంవత్సరాలకు పైగా నియామకం అయినా పోస్టుల్లో ప్రమోషన్ లేకుండా పని చేస్తూ రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు వున్నారని వారి పట్ల ముఖ్యమంత్రి దయ చూపాలని కోరారు. తక్షణమే నిర్ణయం తీసుకోని పదోన్నతి కల్పించాలని కోరారు. విలేకర్ల సమావేశంలో కొట్య నాయక్, సైదా నాయక్, మక్ల నాయక్, గోపీ నాయక్, లాలు నాయక్ శ్రీను నాయక్, జామ్లా నాయక్ తదితరులు వున్నారు.
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు,
మాలోత్ దశరథ్ నాయక్