December 11, 2023

మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 398 మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 98లక్షల 46వేల 168 విలువైన చెక్కులు పంపిణీ


*పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో ‘కల్యాణ’ కాంతులు
* కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం * : మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ(తెలంగాణ పవర్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కల్యాణ కాంతులను వెదజెల్లుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఈ పథకాలను నిరుపేద ఆడబిడ్డలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని ఏఆర్సీ గార్డెన్ లో నియోజకవర్గ వ్యాప్తంగా 398మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 98లక్షల 46వేల 168 విలువైన చెక్కులను
భాస్కర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని కేవలం బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిస్ అలీ,ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు