మలబార్ గోల్డ్, డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నారు
మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నారు

NTR Jr. as Brand Ambassador
జూన్ 23, 2023: ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాలలో 320 షోరూములతో, 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జూనియర్ ఎన్టీఆర్’ పేరుతో విశ్వవిఖ్యాతి గాంచిన మాస్ సూపర్‌స్టార్ నందమూరి తారక రామారావు సంతకము చేసారు. ఇకపై మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రచారచిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ వినియోగదారులను ఆకట్టుకుంటారు. బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటుడిగా, ప్రపంచ దృష్టిని ఆకర్షించే పాన్-ఇండియా మాస్ సూపర్ స్టార్ గా, స్నేహపూర్వకమైన మరియు మర్యాదపూర్వకమైన వ్యక్తిత్వంతో జూనియర్ ఎన్టీఆర్, మలబార్ గ్రూప్ ప్రధాన విలువలైన నమ్మకం, పారదర్శకత మరియు శ్రేష్ఠతను ప్రతిబింబిస్తారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ రెండో ఇన్నింగ్స్ తో మలబార్ గోల్డ్ & డైమండ్స్ 30వ వార్షికోత్సవం సరికొత్త మెరుపులు వెదజల్లుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, భారతదేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల సంఖ్యను విస్తరించడం, కస్టమర్లతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవాలనే మలబార్ గ్రూప్ లక్ష్యం సూపర్-స్టార్ తో చేసిన ఈ ఒప్పందంతో నెరవేరుతుంది.
మలబార్ సంస్థతో అసోసియేషన్ గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “మరోసారి మలబార్ గోల్డ్ & డైమండ్స్‌తో భాగస్వామ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. విశ్వ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా ఉండటమే కాకుండా, భారతీయ కళాత్మకత, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే డిజైన్లను ప్రపంచ వేదికపై విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులే కేంద్రంగా అందించే వాగ్దానాలతో పాటు వారు పాటిస్తున్న ఎన్విరాన్‌మెంట్ సోషల్ గవర్నెన్స్ (ESG) నిబంధనల అమలుతో ఆభరణాల పరిశ్రమలో మలబార్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసాయి. నేను విశ్వసించే విలువలు మరియు బ్రాండ్ పాటిస్తున్న విలువల మధ్య సమిష్టితత్వం నేను స్పష్టంగా చూస్తున్నాను” అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో అనుబంధం గురించి మలబార్ గ్రూప్ చైర్మన్ శ్రీ ఎంపీ అహమ్మద్ మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారితో మా టైమ్- టెస్టడ్ అనుబంధాన్ని పునరుద్దరించినందుకు మేము సంతోషిస్తున్నాము. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఆరాధించబడే సినీ తారలలో ఒకరిగా ఎన్టీఆర్ ఎదిగారు. వారి అత్యుత్తమ ఫిల్మోగ్రఫీ చూస్తే, నటనలోని వివిధ క్రాఫ్ట్‌లపై వారికున్న ఆధిపత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. వారొక అత్యుత్తమ నటుడు మరియు వారి ఆకట్టుకునే వ్యక్తిత్వం మలబార్ బ్రాండ్ విలువను మరింత పెంచుతుంది. ఎన్టీఆర్ తో గతంలో మాకు అద్భుతమైన అనుబంధం ఉంది, ఆ అనుబంధం మళ్ళీ కొనసాగుతుండటం, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 రిటైలర్ జ్యువెలరీ బ్రాండ్ గా నిలవాలనే మా ఆశయం అతి త్వరలో నెరవేరడానికి సహాయపడుతుంది. ఈ ఏడాది 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో, మా విలువైన కస్టమర్లకు ప్రపంచ స్థాయి ఆభరణాల షాపింగ్ అనుభూతితో పాటు పారదర్శకత, ఆభరణాల డిజైన్లలో వైవిధ్యం మరియు హస్తకళలు, అత్యుత్తమ నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము” అన్నారు.
భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, యూఏఈ, కేఎస్ఏ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, మలేషియా, సింగపూర్ మరియు అమెరికా దేశాలలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్ కలిగి ఉంది. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, టర్కీ మరియు న్యూజిలాండ్ వంటి కొత్త మార్కెట్లతో పాటు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించేందుకు మలబార్ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
సౌలభ్యవంతమైన మరియు స్నేహపూర్వకమైన వినియోగదారుల విధానాలతో అసాధారణమైన ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందించడానికి మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రసిద్ధి చెందింది, దీనినే ‘మలబార్ ప్రామిస్’ అని పిలుస్తారు. ఈ వాగ్దానంతో వినియోగదారులకు సాటిలేని నాణ్యత, పారదర్శకత మరియు సేవా హామీ లభిస్తుంది. బంగారం, వజ్రాలు మరియు విలువైన రత్నాభరణాలలో 12 కంటే ఎక్కువ ప్రత్యేక సబ్-బ్రాండ్‌లతో, 20 దేశాల నుండి క్యూరేటెడ్ డిజైన్లను మలబార్ గోల్డ్ & డైమండ్స్ అందిస్తోంది. విభిన్న అభిరుచులు, విస్తారమైన, బహుళ సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన వినియోగదారుల యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా విస్తృతశ్రేణిలో అద్భుతమైన ఆభరణాలను అందిస్తుంది.