ఘనంగా అల్ఫోర్స్ గ్రాడ్యువేషన్ ఉత్సవ్
ఘనంగా అల్ఫోర్స్ గ్రాడ్యువేషన్ ఉత్సవ్
కరీంనగర్ ఏప్రిల్ 12: కరీంనగర్ పట్టణ పరిధిలోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ యుకెజి విద్యార్థులకు నిర్వహించిన గ్రాడ్యువేషన్ డే ఉత్సవ్ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యసంస్థల అధినేత డా వి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాధమిక దశ నుండే నాణ్యతమైన విద్యతో పాటు సమాజం పట్ల అవగహాన పెంపొదించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. విద్యార్థులకు ఉత్తమ భోధనతో పాటు సామాజిక అవగహాన కల్పించి ఉత్తమంగా కొనసాగాలని తెలుపుతూ తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను సమగ్రంగా తయారుచేసి పోటీదారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. తల్లితండ్రులు సైతం వారి పిల్లలకు ఇష్టమైన రంగాలలో శిక్షణ ఇప్పిస్తూ ముందంజలో ఉండాలని ప్రయత్నించారు. ప్రతి విద్యార్ధి కూడా ఉత్తమంగా చదువుకోవాలని, అగ్రగామిగా నిలవాలని కోరారు. ఉపాధ్యాయులు బోధించిన విషయాలను ఎప్పటికప్పుడు సాధన చేసి విషయాలపై పట్టు సాధించాలని కోరారు.
ప్రోత్సహాం అందించడం ద్వారా వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి అసక్తితో ఉంటారని, పోటీతత్వాన్ని ప్రదర్శించడానికి చాలా ఉత్తేజంతో ఉంటారని తెలిపారు. ఇందులో భాగంగానే పాఠశాల అరంభం నాటి నుండి యుకెజి తరగతి విద్యార్థులకు పరీక్షల నిర్వహణ అనంతరం ప్రతిభాధిరిత పత్రాలను పంపీణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతనోత్తేజం కలుగుతుందని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 59 మంది విద్యార్థులకు ప్రతిభాపత్రాలను అందజేయడం జరిగినదని, వీరందరు కూడా పైచదువుకు అర్హత సాధించారని హర్షం వ్యక్తం చేశారు. వేడుకలను పురస్కరించకొని విద్యార్థులు ప్రదర్శించిన “ఐ యామ్ ఏ గ్రాడ్యువేట్ నౌ” “ఓ మై ఫ్రెండ్ మారింది నా ట్రెండ్” నృత్యాలు చాలా ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.